ధర్మపురి లో ఉధృతం పెరుగుతున్న గోదావరి ప్రవాహాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
ధర్మపురి ( జనం సాక్షి )ధర్మపురి గోదావరి భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ముందస్తుగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాం ఎడతెరిపి లేకుండా లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో గోదావరి నది ప్రవాహాన్ని మరియు అక్కపల్లి చెరువు నీటి మట్టాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు.కడెం,శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లనుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందని తెలిపారు.గోదావరి ప్రమాద స్థాయిలో నీరు ప్రవహిస్తుండటం తో రెవెన్యూ, పోలీస్ అధికార యంత్రంగం తగు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు, తదనంతరం ధర్మపురి వాస్తవ్యులు ప్రముఖ న్యాయవాది తిర్మందాస్ సత్యనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ముప్పు గ్రామంలో ముందస్తుగా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరుగుతుందన్నారు.
గోదావరి ప్రవహాన్ని పరిశీలినలో మంత్రి వెంట డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యో రాజేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.