రహదారి భద్రత నియమాలు అందరూ పాటించాలి

 

 

 

 

– పోలీస్ ల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

ఊరుకోండ జనవరి 21, ( జనం సాక్షి ;

రహదారి భద్రత నియమాలు అందరూ పాటిస్తూ సురక్షితంగా వాహన దారులు తమ ఇంటికి క్షేమంగా చేరుకోవాలని ఊరుకొండ పోలీసులు తెలిపారు. మండల కేంద్రంలోనీ జాతీయ రహదారిపై రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడప రాదని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రాణాలను రక్షించుకోవాలని అన్నారు. కార్లు నడిపే వాహనాదారులు తప్పనిసరిగా సీటు బెల్టు ఉపయోగించుకోవాలని తెలిపారు . హెల్మెట్ ధరించనీ కారణంగా వాహనదారులు అనేక ప్రమాదాలకు గురవుతున్నారని, అంతేకాకుండా చాలా మంది ప్రాణాలు కూడా పోవడం జరిగిందని పేర్కొన్నారు.మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని వారికి వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. వాహనాదారులు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వాహనదారులు అతివేగంగా వాహనాలను నడపరాదని నిర్దేశించిన వేగంతోనే గమ్యాన్ని చేరుకోవాలని వాహన చోదకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ వెంకోజి, మహమూద్, కానిస్టేబుల్ విజయక్రాంతి, తిరుపతి, ఉరుకొండ మాజీ సర్పంచ్ మ్యాకల శ్రీనివాసులు, గ్రామస్తులు బ్రహ్మచారి, రాజు, సందీప్ కుమార్,హరీష్, ఆకాష్, వాన దారులు తదితరులు పాల్గొన్నారు.