ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):
ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మైసమ్మ కాలనీ వద్ద బుధవారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగా జనంసాక్షి 2026 నూతన క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని జనంసాక్షి పాత్రికేయులకు, పాఠకులకు, పత్రికా యాజమాన్యానికి ఈ సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. జనంసాక్షి పత్రిక అంచెలంచెలుగా ప్రజల్లో దూసుకెళ్తుందని, రానున్న రోజుల్లో మరింత దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలను వెలికి తీయడంలో జనంసాక్షి ముందుండాలని, ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనంసాక్షి బ్యూరో తడక సుధాకర్ గౌడ్, ఐఎన్ టియుసి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైసమ్మ కాలనీ వాసులు పాల్గొన్నారు.



