‘వీబీ`జీరాంజీ’కి పాతపేరే కొనసాగించాలి ` రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావిÖ పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే భాజపా ప్రధాన ఉద్దేశమని ఆరోపించారు. దిల్లీలో నిర్వహించిన ఉపాధి హావిÖ కార్మికుల సదస్సులో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.దేశంలో రాచరిక పాలనను ప్రవేశపెట్టాలని మోదీ ప్రభుత్వం భావిస్తోందన్నారు.“గతంలోనూ రైతుల హక్కులను కాలరాసేందుకు కేంద్ర వ్యవసాయ రంగంలో మూడు చట్టాలను తీసుకొచ్చింది. అన్నదాతల ఆందోళనలతో వెనక్కి తగ్గింది. అదే మాదిరిగా ఇప్పుడు పేద కూలీలపై ‘వీబీ జీరాంజీ’పేరుతో వారి పని హక్కులను హరించాలని చూస్తోంది. దేశంలో ప్రతిదీ రాజు (ప్రధాని) మాత్రమే నిర్ణయించాలనే కొత్త సిద్ధాంతాన్ని భాజపా సష్టిస్తోంది”అని ఆరోపించారు. వీజీ`జీరాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రావిÖణ ఉపాధి హావిÖ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పెద్ద ఎత్తున అందోళనకు సిద్ధమైంది. ఈ నెల 10 నుంచి ఫిబ్రవరి 25 వరకు దేశవ్యాప్తంగా ‘ఎంజీనరేగా బచావో సంగ్రాం’ ఆందోళన కార్యక్రమం చేపడుతున్న విషయం తెలిసిందే.

