దావోస్‌లో పెట్టుబడుల వరద
` వరల్డ్ ఎననామిక్ ఫోరంకు ఫాలోఅప్ సదస్సు ఉండాలి
` అది ప్రతి యేటా హైదరాబాద్‌లో నిర్వహించాలి
` ప్రపంచ ఆర్థిక వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన
` వివిధ సంస్థలతో తెలంగాణ బృందం చర్చలు
` వేయికోట్ల పెట్టుబడులకు సర్గడ్ సంస్థతో ఎంవోయూ
` హైదరాబాద్‌లో రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు బెí్లజ్ అంగీకారం
` రష్మీ గ్రూప్ 12500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
దావోస్(జనంసాక్షి):వరల్డ్ ఎననామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సును ఏటా నిర్వహించాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు. దావోస్‌లో జరుగుతున్న సదస్సులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం జులైలో హైదరాబాద్‌లో దీన్ని నిర్వహించాలని కోరారు. సీఎం ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు మద్దతు తెలిపారు. ఇదిలావుంటే వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయిన సిఎం రేవంత్ పలు రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026 సదస్సు సందర్భంగా అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ సీఈఓ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఎమఆరఓ కేంద్రాన్ని వరంగల్ లేదా ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీంతో రాష్ట్రం.. విమానయాన, ఏరోస్పేస్ రంగాల్లో మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. అలాగే.. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న బెí్లజ్ కంపెనీతో మరో ఎంవోయూ కుదిరింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డితో సీఈఓ దినాకర్ మునగాలా సమావేశమయ్యారు. హెల్త్‌కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, ఎఐ ఎనర్జీ రంగాల్లో పైలట్ ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. తక్కువ విద్యుత్ వినియోగంతో ఎఐహార్డ్‌వేర్, ఫుల్`స్టాక్ సాప్ట్‌వేర్ అభివద్ధిలో బెí్లజ్ సంస్థ అగ్రగామి. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ సెంటర్ విస్తరణకు బెí్లజ్ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందంతో తెలంగాణలో ఎలక్టానిక్స్, సెవిÖ కండక్టర్, ఎఐ రంగాలకు ఊపిరి లభించనుంది. తెలంగాణను ఎఐ డేటా సెంటర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభంకానుందని మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అంతేకాకుండా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతత్వంలోని ’తెలంగాణ రైజింగ’ బృందం రష్మి గ్రూప్‌తో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన భారీ ఎంవోయూ కుదుర్చుకుంది. తెలంగాణలో రష్మి గ్రూప్ ఆధునిక స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. దీనికి సుమారు 12,500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 12 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్ష ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. డ్టకైల్ ఐరన్ పైపుల తయారీలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్… ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో విస్తత కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు, బొగ్గు లింకేజీలు అందిస్తామని హావిÖ ఇచ్చింది. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానవిÖ విధానాలపై కూడా భాగస్వామ్య చర్చలు జరిగాయి. కాగా.. సీఎం రేవంత్.. జనవరి 20 నుంచి 23 వరకు దావోస్‌లోని డబ్ల్యూఈఎఫ్ 2026 సదస్సులో పాల్గొననున్నారు. పర్యటనలో సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల మంత్రులు డి.శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రెటరీలు జయేశ్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ’తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ప్రపంచ నాయకులు, సీఈఓల ముందు ప్రదర్శించడమే ప్రధాన లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన కొనసాగుతోంది.
·ప్రపంచ ఆర్థిక సదస్సులో చిరంజీవి
హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ప్రముఖ నటుడు చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి ఆ దేశంలోని జ్యూరిక్‌లో ఉన్నారని తెలుసుకున్న సీఎం.. సదస్సుకు రావాలని ఆహ్వానించారు. దీంతో ఆయన హాజరయ్యారు. సదస్సు వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్`2047 విజన్ డాక్యుమెంట్‌ను చిరంజీవి వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివద్ధి దక్పథాన్ని ఈ డాక్యుమెంట్ ప్రతిబింబించింది.అనంతరం చిరంజీవితో రేవంత్ మాట్లాడుతూ తమ కుటుంబసభ్యులతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా వీక్షించానని.. ఎంతో ఆస్వాదించానని తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం అభినందనలు తెలిపారు.చిరంజీవి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సమయంలోనే దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండటంతో సీఎం రేవంత్‌రెడ్డి.. చిరంజీవిని అక్కడికి ఆహ్వానించారు.


