ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోండి
` బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది
` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ
కొమురం భీం(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం బిల్లు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ లబ్ది దారులు ఏ ఒక్కరోజు ఆలస్యం చేయకండి. వడివడిగా ఇండ్లు కట్టుకోండి.. బిల్లు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వానిదే అని భట్టి తెలిపారు. జైనూర్ మండలంలోని జంగాం గ్రామంలో భట్టి విక్రమార్క పర్యటించారు. స్వయం సహాయక మహిళ సంఘాలకు రూ.3.41 కోట్ల వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించిన పత్రాలు అందజేశారు. ఈ సంద్భంగా భట్టి మాట్లాడుతూ.. నీటి పారుదల సమస్యలు అడిగారు. అప్ప్పుడు బ్రిడ్జి అడిగారు. వాటి పనులు పూర్తి చేసే పనిలో ఉన్నామన్నారు. ఓజా కళాకారుల కళ ఎంతో గొప్పది అని కొనియాడారు. కళాకారులను ఆదుకుంటాం అని అండగా ఉంటామని చెప్పాను. అందులో భాగంగా విÖ ఓజా కళను కాడుకోవడం కోసం రుణాలు ఇచ్చే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని మహాలక్క్ష్మి ల్లాగా ఉన్నారు.. మహిళలకు ఇప్పటికే రూ.26 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని వెల్లడించారు. మహిళల్ని కోటీశ్వరులను చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. విÖరు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మేము డబ్బులు కడుతున్నామని తెలిపారు. నాడు వెయ్యి రూపాయలు లేని పరిస్థితిలో ఉన్న మహిళను నేడు బస్సులకు ఓనర్లను చేశాం.. చెప్పినట్టుగానే ధరణి తీసి భూ భారతి తెచ్చామని భట్టి తెలిపారు. కొమరం భీం ప్రాజెక్ట్ కెనాల్ కాలేదు అన్నారు.. వారికి ప్రపోజల్స్ పంపారు.. పనులు త్వరలో ప్రారంభం చేస్తామని హావిÖ ఇచ్చారు. దొడ్డు బియ్యం స్థానం లో సన్న బియ్యం ఇస్తున్నాం.. 96 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇచ్చాం. విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట, ప్రజా బాట పట్టారు. విÖ సమస్యలు పరిష్కారం చేస్తారు. వారిని కలవండని గ్రామస్తులకు సూచించారు. 108 తరహాలో విద్యుత్ సమస్యల పైన 1912 ను సంప్రదించండి విద్యుత్ సమస్యలను పరిష్కారం చేస్తారని అన్నారు. విÖ ప్రాంత సమస్య లను పరిష్కారం కోసం ఓ అంబులెన్స్ వస్తుందని ఉపముఖ్యమంత్రి భట్టి తెలిపారు.


