ఢిల్లీలో మళ్లీ క్షీణించిన గాలి నాణ్యత

న్యూఢిల్లీ(జనంసాక్షి):ఢిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్ కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 339గా వద్ద నమోదైంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వీటి స్థాయిల్ని వెరీపూర్ కేటగిరీలో వర్గీకరించింది. మంగళవారం ఎక్యూఐ 395 స్థాయిల వద్ద నమోదైంది. నిన్నటికంటే ఈరోజుకి గాలి నాణ్యతలు మెరుగుపడ్డాయని సిపిసిబి వెల్లడించింది. ఢిల్లీలో 30 వాతావరణ పర్యవేక్షణా కేంద్రాల్లో గాలి నాణ్యతలు ’వెరీ పూర’ కేటగిరీలోనే నమోదయ్యాయి. ఎనిమిది కేంద్రాల్లో పూర్ కేటగిరీలో ఎక్యూఐ స్థాయిలు నమోదైనట్లు సవిÖర్ యాప్ సమాచారం తెలిపినట్లు సిపిసిబి పేర్కొంది. ఇక ఢిల్లీలో జహంగిర్‌పూర్‌లో గాలి నాణ్యతలు పేలవంగా నమోదయ్యాయి. అక్కడ ఎక్యూఐ స్థాయిలు 390గా నమోదైనట్లు సిపిసిబి పేర్కొంది.