మరింత దిగువకు రూపాయి

` ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.91.74కు పతనం
న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశీయ కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అంతర్జాతీయ విపణిలో డాలరుతో రూపాయి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరింది. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూపాయి 91.74 వద్ద కనిష్ఠానికి చేరింది. రూపాయికి ఇప్పటివరకు ఇదే కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు తమ నిధులు తరలించడం, అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం వంటివి సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా కారణమని అనలిస్టులు పేర్కొంటున్నారు. డిసెంబర్‌లో ఒకసారి 91 మార్కు దాటగా.. తాజాగా మరోసారి ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయిలకు రూపాయి విలువ చేరడం గమనార్హం.