‘ధర్మాన రాజీనామా ఎందుకు ఆమోదించట్లేదు?’ ఎర్రన్నాయుడు

న్యూఢిల్లీ: సీఎం  కిరణ్‌కుమార్‌రెడ్డిపై టీడీపీ  ఎమ్మెల్యే ఎర్రన్నాయుడు ధ్వజమెత్తారు. ధర్మాన ప్రసాదరావు రాజీనామా చేసి ఇన్ని రోజులైనా ఎందుకు ఆమోదించట్టేదని ప్రశ్నించారు. ఎవరు బెదిరిస్తే వారి బెదిరింపులకు సీఎం లొంగిపోతున్నారని విమర్శించారు. ధర్మాన రాజీనామా ఆమోదించవద్దని మంత్రులే ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోకు వ్యతిరేకంగా బోధనా ఫీజులు, ఉపకార వేతనాలు తగ్గిస్తున్నారని  తెలిపారు.