ధోనీ అర్థ శతకం

చెన్నై : పాక్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత కెప్టెన్‌ ధోని అర్థ శతకం పూర్తి చేశాడు. ఆదిలోనే పాక్‌ బౌలర్ల ధాటికి వెనువెంటనే 5 వికెట్లు కోల్పోయిన అనంతరం బరిలోకి దిగిన ధోని నిలకడగా ఆడుతూ రెండు బౌండరీలు, ఒక సిక్సర్‌తో అర్థ శతకం నమోదు చేశాడు. ప్రస్తుతం భారత్‌ 43 ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.