*నాగర్ కర్నూల్ జిల్లాలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి కేసీఆర్, అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం*
జనం సాక్షి నాగర్ కర్నూల్ :- తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల ఇల్లు ఇళ్లస్థలాలపై సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంతో అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టు సమాజానికి శుభ పరిమాణం. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా పరిధిలో జర్నలిస్టులు అందరూ కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ,తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండటం వల్ల అర్హత కలిగిన జర్నలిస్టులకు ఇల్లు, స్థలాలు దక్కేలా కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ కి తెలంగాణ జర్నలిస్టులు ఎల్లకాలం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. మరియు జర్నలిస్టు సమాజం సుప్రీం కోర్టు తీర్పుకు రుణపడి ఉంటుందన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కృషిచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు జర్నలిస్టు సంఘాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు ఇతర జర్నలిస్టు పాల్గొన్నారు.