నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల నిలుపుదల
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదలను ఎన్నెస్పీ అధికారులు బుధవారం నిలుపుదల చేశారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామ ర్ధ్యం 590 (312.4050 టీఎం సీలు) అడుగులకు గాను 589.70 (311.1486 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 8022 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 7381 క్యూసెక్కు లు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 32602 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 50405 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుండగా అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 883.90 అడుగులు (208.2841టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 31444 క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.