నాటు తుపాకులతో తిరుగుతున్న నలుగురి అరెస్టు
హైదరాబాద్: అనుమతి లేకుండా నాటు తుపాకులతో తిరుగుతున్న నలుగురిని మెదక్ జిల్లా బొల్లారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన నలుగురు పటాన్‌చెరు మండలంలో చేపలచెరువువ్ద పనిచేసేందుకు వచ్చారు. తమ వద్ద వున్న తుపాకులతో పిట్టలను వేటాడుతుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.



