నిప్పంటించుకుని ఇద్దరు మహిళల బలవన్మరణం

సోంపేట(శ్రీకాకుళం): కొరంజభద్ర, పోత్రకండ గ్రామాల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మహిళలు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోని నిప్పంటించుకుని బలవన్మరణం చెందారు. పొత్రకండలో ఇంటర్‌ విద్యార్థిని ఢిల్లేశ్వరి (16),కొరంజభద్రలో హరతి(23) అనే వివాహిత ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వీరి మరణాలకు వ్యక్తిగత అంశాలే కారణంగా తెలుస్తోందని కేసు దర్యాప్తు చేస్తున్న బారువా పోలిసులు చెప్పారు.