నిమ్స్‌, స్విమ్స్‌ ప్రవేశపరీక్షల్లో జితేందర్‌ ప్రతిభ

ఖమ్మం, జూలై 17 : హైదరాబాద్‌లోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డిఎం సూపర్‌ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగంలో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో ఖమ్మంలోని మమతా జనరల్‌ ఆసుపత్రి వైద్యులు జితేందర్‌జైన్‌ 69/90 మార్కులతో రాష్ట్రస్థాయిలో ఆరవ ర్యాంకు సాధించాడు. ఇదే విభాగం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ గత నెలలో ప్రకటించిన ప్రవేశపరీక్షా ఫలితాల్లో 84/100 మార్కులు సాధించి ఆరవ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఈ రెండు ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2, 3 స్థాయిలో నిలవడం విశేషం. జితేందర్‌జైన్‌ స్వగ్రామం వరంగల్‌ జిల్లా దోర్నకల్‌. పదవ తరగతిలో మండల స్థాయిలో రెండవ ర్యాంకు, ఇంటర్‌లో 920 మార్కులు, ఎంసెట్‌ వైద్య విభాగంలో 527 మార్కులు సాధించి ప్రతిభ చాటుకున్నారు.