నూతన పింఛన్లు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆనంద్.

మర్పల్లి ఆగస్టు 26 (జనంసాక్షి) దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన పింఛన్ అందిస్తున్నరు అని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్, మొగిలి గుండ్ల గ్రామాల్లో నూతన లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను  అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, కో ఆప్షన్ నెంబర్ శోయాల్ షరీఫ్,  రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నాయక్ గౌడ్,  సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పట్లూర్ సర్పంచ్ ఇంద్ర అశోక్, పలు గ్రామాల సర్పంచ్, ఎంపీటీసీ, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.