నేటి అర్ధరాత్రి నుంచి పన్ను వసూలు: మహేందర్ రెడ్డి
హైదరాబాద్: కోర్టు ఆదేశాలను గౌరవించే.. ఇంతకాలం పన్ను వసూలు చేయలేదని తెలంగాణ రావాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి ఎపితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలపై పన్ను వసూలు చేస్తామని చెప్పారు. రూల్స్ ప్రకారమే పన్ను వసూలు చేస్తామని పేర్కొన్నారు. నేటి అర్ధరాత్రి నుంచి పన్ను వసూలు అముల్లోకి వస్తుందని తెలిపారు.