నేటి అర్ధరాత్రి నుంచి 20వ తేదీ రిజర్వేషన్‌ బుకింగ్‌ సేవల్లో అంతరాయం

హైదరాబాద్‌ : ఆరు రోజుల పాటు రాత్రి 11.30గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 గంటల పాటు రిజర్వేషన్‌ బుకింగ్‌ సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నేటి అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు సేవల్లో అంతరాయం ఉంటుందని తెలిపింది. కరెంట్‌ బుకింగ్‌, టికెట్ల రద్దు సేవలు అందుబాటులో ఉండవి స్పష్టం చేసింది. రైల్వే డేటా అప్‌డేట్‌ చేస్తుండడంతో సేవలకు అంతరాయం కలుగుతుందని పేర్కొంది.