నేటి నుంచి డీఎస్సీ రాతపరీక్షలు

హైదరాబాద్‌: డీఎస్సీ-2012 రాతపరీక్షలు ఆదివారం నుంచి మంగళవారం వరకు జరగనున్నాయి.21,343 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా 4,23,111 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1874 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు విద్యాశాఖ తెలిపింది.