నేడు ఆసరా పింఛన్లు ఎమ్మెల్యే హరిప్రియ చేతులు మీదుగా పంపిణీ
టేకులపల్లి, సెప్టెంబర్ 1( జనం సాక్షి): నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఆసరా పింఛన్లను సెప్టెంబర్ 2న ఇల్లందు శాసనసభ్యురాలు బానోతు హరిప్రియ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ఇల్లందు మండలంలో సింగరేణి గ్రౌండ్ లో ఉదయం 10 గంటలకు ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తారని, ఆ తరువాత టేకులపల్లి మండలంలో తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పింఛన్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరి సింగ్ నాయక్, ఇల్లందు ,టేకులపల్లి మండలాల జడ్పిటిసిలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు ,పిఎసిఎస్ చైర్మన్లు, పిఎసిఎస్ వైస్ చైర్మన్, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీ డైరెక్టర్లు, పంచాయతీ వార్డు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ నాయకులు, పింఛన్ లబ్ధిదారులు ,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరారు.