నేడు జీ తెలుగు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

విజయనగరం, జూలై 26: శ్రావణమాసం సందర్భంగా మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు జీ తెలుగు ఛానల్‌ శ్రీకారం చుట్టింది. ఈ నెల 27వ తేదీ శుక్రవారం విశాఖలోని ఎంవిపి కాలనీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో ఈ వ్రతాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సందర్భంగా జీ తెలుగు మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు ఎంతో పవిత్రంగా చేసే వరలక్ష్మీ వ్రతాన్ని ఇంటిలో కాకుండా నగరంలోని మహిళల చేత జరిపించేందుకు ఈ వినూతన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ వ్రతానికి జీ తెలుగులో ప్రసారం అవుతున్న చిన్న కోడలు సీరియల్‌ యూనిట్‌ వస్తుందన్నారు. అంతేకాకుండా జ్యోతీష్యా, వాస్తు, సంఖ్యాశాస్త్రాల నిపుణులు వక్కంతం చంద్రమౌళి హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో సకుటుంబ సమేతంగా మహిళలు అందరూ పాల్గొనాలని కోరారు. జీ తెలుగు ఛానల్‌ బ్యూరో చీఫ్‌ ఆర్‌. రామచంద్రరావు, మహిళా ప్రతినిధులు పి.సూర్యలక్ష్మి, జె.సుధా, ఆర్‌.లక్ష్మి, టి.ఉమా తదితరులు ఈ కార్యక్రమం గురించి వివరించారు.