నేడు నిరుద్యోగులకు జాబ్‌మేళా

share on facebook

రంగారెడ్డి,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ సంస్థల్లో ఈనెల 13న నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పనాధికారి ప్రశాంతి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలకు హాజరు కావొచ్చన్నారు. వివిధ రకంపెనీల్లో 850 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. జీతం రూ.10వేల నుంచి 25వేల వరకు ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఎస్సెసీ, ఐటీఐ డిప్లొమో, గ్రాడ్యుయేట్‌, పీజీ చదివినవారు ఈ ఉద్యోగాల ఎంపికకు హాజరు కావాలన్నారు. ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, జస్ట్‌ డయల్‌, ఎస్‌వీఎల్‌, భష్యం డెవలపర్స్‌ తదితర కంపెనీల్లో మల్టీఫుల్‌ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు వెల్లడించారు.

Other News

Comments are closed.