నేడు భూపతిపాలెం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:జటయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన తొలి నీటిపారుదల శాఖ ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వద్ద సీతపల్లి వాగుపై నిర్మించిన భూపతిపాలెం ప్రజెక్టును ద్వారా రంపచోడవరం,గంగవరం మండలాల్లోని 33 గ్రామాల్లోని 14,028 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది.గత ఏడాది నిర్వహించిన ట్రైల్‌రస్‌లో 4వేల ఎకరాలకు మాత్రమే నీరు అందింయగలిగారు.ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.151కోట్టు అధికశాతం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌కే కేటాయించారు.