నేడు మంత్రి ఆనం జిల్లా పర్యటన

నెల్లూరు, జూలై 22 : నెల్లూరు, ఉదయగిరి పార్లమెంట్‌ సీట్లకు ఉప ఎన్నికలు జరిగిన అనంతనరం హైదరాబాద్‌లోనే ఉంటున్న మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం నుంచి రెండులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పౌర సంబంధల శాఖ అధికారి కమలాకర్‌రెడ్డి వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం ఆనం హైదరాబాద్‌ నుంచి విమానంలో రేణిగుంటకు చేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి పెళ్లకూరు మండలంలోని సిరిసమంచేడు గ్రామంలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు నాయుడుపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు. రాత్రికి నెల్లూరులో బస చేస్తారు. 24వ తేదీ ఉదయం 10 గంటలకు ఆత్మకూరు చేరుకుని అక్కడి మున్సిపల్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌ బయలు దేరి వెళ్తారు.