నేడు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌

ఏలూరు, జూలై 16 : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు ఈ బంద్‌ జరగనుంది. ఎయిడెడ్‌ రంగాన్ని నిర్వీర్యం చేసే జీవో-35ను ఉపసంహరించాలని ప్రైవేటు విద్యాసంస్థలో ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బంద్‌కు పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎబివిపి, పిడిఎస్‌యు, యుటిఎఫ్‌, టిఆర్‌టియు, వైఎస్‌ఎఫ్‌ వంటి సంఘాలు బంద్‌లో భాగస్వాములు కానున్నాయి. ఈ బంద్‌ను దృష్టిలో పెట్టుకొని మంగళవారం నాడు విద్యాసంస్థలను ముసివేస్తున్నామని ప్రైవేటు విద్యాసంస్థల అసోసియేషన్‌ విద్యార్థుల తల్లిదండ్రులకు సంక్షిప్త సమాచారం అందజేశారు.