నేడు లండన్‌కు వెళ్లనున్న చిరంజీవి

హైదరాబాద్‌: రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఈ రోజు సాయంత్రం లండన్‌ బయలుదేరి వెళ్లనున్నారు. ఈనెల 14,15 తేదీల్లో లండన్‌లో జరుగనున్న ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు. యుకె తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఈ మహాసభల్లో పాల్గొనేందుకు శాసనమండలి ఛైర్యన్‌ చక్రపాణి, మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ ఇప్పటికే లండన్‌ చేరుకున్నారు.