నేను నేరం చేయలేదు.. సాయం చేశాను


` సర్కారుకు కాలమే సమాధానం చెబుతుంది
` సోనూసూద్‌
ముంబయి,సెప్టెంబరు 20(జనంసాక్షి):ప్రముఖ నటుడు సోనూసూద్‌ నివాసాలపై ఇటీవల జరిగిన ఐటీ దాడులపై ఆయన స్పందించారు. నాలుగురోజులపాటు జరిగిన ఐటీ దాడుల అనంతరం ఆయన సోమవారం ట్వీట్‌ చేశారు. ఏ విషయంలోనైనా ప్రతిసారీ నువ్వు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. మంచి మనస్సుతో దేశ ప్రజలందరికీ నా వంతు సాయం చేయాలని అనుకున్నాను. సాయంతోపాటు.. విలువైన ప్రాణాల్ని కాపాడటానికే నా సంస్థలోని ప్రతి రూపాయీ ఎదురుచూస్తోంది. అలాగే నేను ప్రచారకర్తగా వ్యవహరించినందుకు వచ్చే పారితోషికాన్ని మానవసేవ కోసమే వినియోగించాలని ఆయా బ్రాండ్‌లకు సూచించాను. అలానే మా ప్రయాణం కొనసాగుతోంది. అయితే గడచిన నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండడం వలన విూకు అందుబాటులో లేను. మళ్లీ సేవలందించేందుకు ఇప్పుడు విూ ముందుకు వచ్చేశాను’ అంటూ సోనూసూద్‌ ట్వీట్‌ చేశారు. న్ను ఎగవేత ఆరోపణలతో.. సోనూసూద్‌ ఇళ్లు, కార్యాలయాల్లో నాలుగురోజులపాటు ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఈ క్రమంలో సోనూ రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఐటీ శాఖ వెల్లడిరచింది. ఈ సందర్భంగా సోనూ కరోనా మొదటి వేవ్‌లో ఆయన ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థకు రూ. 18 కోట్లకు పైగా విరాళాలు సేకరించగా.. వాటిల్లో కేవలం 1.9 కోట్ల రూపాయలను మాత్రమే సేవా కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని అధికారులు తెలిపారు.