నేరం-శిక్ష : బాల్‌ ఠాక్రే, అజ్మల్‌, కసబ్‌

(శనివారం సంచిక తరువాయి భాగం….)

కాని నేరం ఏమిటి అని నిర్వచించడూనుకుంటే, సమాజంలో నేరా లుగా నేటిని పరిగణిస్తున్నారో చూస్తే, శిక్షల తీరును, పర్యవసానా లను చూస్తే ఇది అంత సులభమైన వ్యవహరాం కాదని తేలిపో తుంది. ఒక వ్యక్తో, ఒక సమాజమో ఏదయినా చర్యను నేరం అను కున్నంత మాత్రాన అది నేరం కాదు, చట్టంలో క్రోడ డీకరించబ డినవది మాత్రమే నేరం అవుతుంది. మరి చట్టాలను తయారుచేసే అధికారం ఉన్నవారు తమ ఇష్టారాజ్యంగా నేరాలను నిర్వచిసేత వా టికి శిక్షలను విధిస్తే అంగీకరించవలసిందేనా? నేరాలను నిర్వ చిస్తే, వాటికి శిక్షలను విధిస్తే అంగీకరించవలసిందేనా? అందుకే నేరం-శిక్ష ప్రక్రియ చాల సంక్లిష్టమైనది. అనేక చారిత్రక, రాజ కీ యార్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాలతో కలుగలిసినది. అసలు ఒక నురానికి విధించే శిక్ష మాజంలో ఆ నేరాలు మళ్లీ జరగకుండా శిక్షణ ఇవ్వగలిగిన, మానసిక పరివర్తన తేదగిన సామర్థ్యం కలిగినదై ఉండాలి. అసలు సమాజంలో ఏ మూల కారణాల వల్ల ఆ నేరం జర గడానికి అవకాశం వస్తున్నదో ఆ మూలకారణాలను తొలగించ గలిగినదీ, తగ్గించగలిగినదీ గా ఉండాలి. కాని ప్రస్తుత శిక్షలేవీ అం త విశాలమైన సంస్కరణ దృష్టిగానీ, రాజకీయార్థిక దృష్టిగానీ కలిగి నవి కావు. తమ పాలన సజావుగా సాగడం కోసం బ్రిటిష్‌ వలస వాదులు రాసిపెట్టిన చట్టాలను యథాతథంగా అమలు చేస్తున్న భార త పాలకులు నేరం-శిక్ష ప్రక్రియ గురించి అంత నిశితమైన వైఖరి తీసు కుంటారని ఆశించలేం. కాని మామూలుగా మధ్యతరగతి వ్యాక్యాతలు శిక్షలను, ముఖ్యంగా మరణ శిక్షను సమర్థించేటప్పుడు ఇకముందు ఇటువంటి నేరం జరగకుండా బెదురు కలిగించేలా శిక్ష ఉండాలని వాదిస్తారు. సమాజంలో ఎంత తీవ్రమైన శిక్షలు అమ లవుతున్నప్పటికీ మళ్లీ పదేపదే అవే నేరాలు జరుగుతూ ఉండడమే ఈ వాదన డొల్లవాదన అని చెప్పడానికి ఉదాహరణ. నిజంగానే శిక్షలు బెదురుగా పనిచేస్తే ఇన్ని నేరాలు జరుగుతూ ఉండేవి కావు. నిజానికి ఈ వాదన చేసేవారికి నేరాలు ఎందుకు జరుగుతాయో తెలియదు. అసలు నేరం అంటే ఏమిటి, పాలక వర్గాలు, చట్టాలు నిర్వచించినదే నేరమా వంటి తాత్విక ప్రశ్నలను కాసేపు పక్కన పెట్టినా, నేరాలు జరగడానికి మూడు రకాల కార ణాలు ఉంటాయి. తమ చుట్టూ ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల ఒత్తిడివల్ల జరిగేవి మొదటి రకం. అటువంటి ఒత్తిడి వల్ల నేరాలు జరుగుతాయి గనుక ఆ నేరాలను ఏవో బెదురులు చూపి ఆపడం సాధ్యం కాదు. రెండో రకం నేరాలు క్షణికావేశానికి గురయి చేసేవి.

ఆ నేరాలు స్వభావం వల్లనే మనుషులు ఉద్దేశపూర్వకంగా, ఆలోచించి చేసేవి కావు. అప్పటికప్పుడు భావోద్వేగం తోసుకువస్తే చేసేవి. ఆ భావోద్వేగంలో తాను చేసేది నేరమని, దానికి శిక్ష ఉంటుందని బెదిరే సమయం గాని, ఆలోచన గాని ఉండే అవ కాశం లేదు. ఇక మూడో రకం నేరాలు పథకం ప్రకారం, ఉద్దేశ పూర్వకంగా నేరా నికి సంపూర్ణ ప్రణాళిక రచించుకుని, వ్యూహం పన్ని చేసే నేరాలు. ఈ నురస్తులకు చట్టం అనేది ఉందని, తాము చేసే నేరానికి ఫలానా ఫలానా శిక్షలు ఉన్నాయని సంపూర్ణంగా తెలుసు. వారికి ఆ శిక్షల బెదురే ఉండదు. అంటే ఎలా చూసినా  శిక్ష అనేది నేర్తులకు బెదు రుగా పనిచేస్తుందని, అందువల్ల మరణ శిక్షలాంటి పెద్ద శిక్షలు ఉం డవవలసిందేనని చేసే వాదనలకు అర్థం లేదు. అవి ఎప్పటికీ తాము అనుకున్న ఫలితాన్ని కూడ సాధించలేవు. మరి మరణశిక్షకు, లేదా ఇటువంటి పెద్ద శిక్షలకు సమర్థన ఎక్కడి నుంచి వ్తున్నది? ఇవి కేవలం ప్రతీకారవాంఛ నుంచి పుట్టినవి. అవతలివాళ్ల మనకు నష్టం, బాధ కలగజేశారు కాబట్టి, వాళ్లకు మనం అంతే సమానమైన నష్టాన్ని, బాధ కలగజే సేశారు. కాబట్టి, వాళ్లకు మనం అంతే సమా నమైన నష్టాన్ని, బాధను కలగజేయాలి అని బహుశా ప్రతి వ్యక్తీ అ నుకుంటారు. వ్యక్తిగత స్థాయిలో ఉండే ఈ ప్రతీకారవాంఛ వల్లనే కసబ్‌ ఉరితీత జరగగానే ముంబై మారణకాండ బాధిత కుటుం బాలు సంతో షించాయి. కాని కంటికి కన్ను, పంటికి పన్ను అనే ఈ ఆదిమ, మధ్యయుగాల ప్రతీకార న్యాయం నాగరికమైనది కాదని కొన్ని శతాబ్దాలుగా మానవజాతి ఆలోచిస్తున్నది. వ్యక్తి తన పట్ల జరి గిన నేరానికి ప్రతీకారం తీసుకోవాలనే కోరికతో కంటికి కన్ను పంట ికి పన్ను కోరతారని అందువల్ల ఆ ప్రతీకారం తీర్చుకునే అవకాశాన్ని  బాధిత వ్యక్తికి ఇవ్వకూడదని, సమాజంలోని భిన్న ప్రయోజనాల మధ్య సమన్వయం కురిర్చే రాజ్యమే ఆ బాధ్యతను వహిస్తుందని, ఆ ప్రతీకారాన్ని నాగరిక పద్దతుల్లో సాధిస్తుందని ఆధునిక చట్టబద్ద పాలనా భావన చెబుతుంది. అందుకే మిగిలిన నేరాలన్నీ వ్యక్తిగత స్థాయిలో ఉన్నా, హత్యా నురాలలో మాత్రం బాదితుల తరపున ప్రభుత్వమే వాదిస్తుంది. కంటికి కన్ను, పంటికి పన్ను అని ప్రతి ఒక్కరూ అనుకుంటే మొత్తం సమాజమే గుడ్డిదైపోతుంది అని గాంధీ అన్న మాట మరణశిక్షను దృష్టిలో పెట్టుకున్నదే. ఈ ప్రతీ కారం గురించి నేరానికి తగిన శిక్ష ఉండడం గురించి వాదించే మధ్య తరగతి అన్ని నేరాల గురించీ ఇలాగే ఆలోచిస్తుందా అని చూస్తే దాని వాదనల దివాళాకోరుతనం మరింత బయటప డుతుంది.

అణ గారినవర్గాలు, అదికారంలో లేని వర్గాలు, నిస్సహా యవ్యక్తులు, బృం దాలు చేసే నేరాలకు కఠిన శిక్షలు విధించాలని, మరణశిక్ష తప్ప నిసరిగా ఉండాలనీ వాదించేవారు, ఆధిపత్య వర్గపు నేరాల విషయంలో పాలకవర్గ విధానాలే నేరాలుగా మారే సందర్భాలలో తమ నేర నిర్వచనాన్ని మార్చేసుకుంటారు. ఆస్తి, ఆగ్రవర్ణం, మెజారిటీ మతం, పురుషాధిపత్యం, పెద్ద వయసు, అభివృద్ధి చెందిన ప్రాంతం వంటి అవకాశాలు ఉన్నవారు చేసే నేరాలు నేరాలుగా కనబడవు. వాటికి శిక్షలు విధించాలని ఎవరూ గొంతెత్తి పలకరు. ఇక అధికా రాన్ని చేపట్టిన పాలకవర్గ విధానల పర్యవసానాలను నేరాలుగా గు ర్తించడం వాటికి శిక్షలు పడాలని కోరడం అసాధ్యమే అవుతుంది. కసబ్‌ కొన్ని మరణాలకు, 164 మందో 167 మందో మరణిం చడానికి ప్రత్యక్ష బాధ్యుడు గనుక ఉరి తీయవలసిందే అని వాదిం చేవారు అటువంటి మరనాలకే కారణమవుతున్న ఇతర నేరస్తుల గురించి పట్టించుకుంటారా? ఉత్పత్తి సాధనాలను తమ గుప్పెట్లో పెట్టుకుని, అశేష పీడిత ప్రజానీకాన్ని ఆకలికీ, చీకటికీ, అనారో గ్యానికీ, అవిద్యకూ. నిరుద్యోగానికీ గురిచేస్తున్న, అందువల్ల కోట్లాది మంది మరనాలకు కారణమ వుతున్న నేరస్తులను ఎలా శిక్షించాలి? తోటి మాన వుల పట్ల కుల వివక్ష చూపుతూ కోట్లా ది మందిని అవమానానికీ, నిరాదరణకూ, దారి ద్య్రానికీ గురి చేస్తున్న అగ్రవర్ణాల నేరాలు ఎక్కడ యినా నమోదవుతున్నాయో, వాటికి శిక్షలు పడు తున్నా యో? స్త్రీని అవమానంగా చూసి ప్రభూణ హత్యల నుంచి వర కట్నపు చావుల దాకా తక్షణ హత్యలకూబతికి ఉండనిచ్చినా దుర్మా ర్గమైన అసమానతకూ వివకక్షూ, దీర్ఘకాలిక మత్యలకూ గురి చేస్తున్న పితృస్వామిక, పుషాధిపత్య అహంకారాన్ని నేరంగా అంగీకరిస్తారా? ఆ నేరానికి శిక్ష విధిస్తారా? పోనీ అవన్నీ సామాజిక వ్యవస్థలో, భావజాలంతలో భాగమైన, అలవాటైన స్వభా వాలని అనుకున్నా, మన కళ్ల ముందర, మూడువేల మందిని ఊచ కోతకోసిన నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా ఎన్నుకుని, రేపో మాపో ప్రధానమంత్రి కావాలని కలలు కంటూ. ఆయన చేసిన, చే యించిన హత్యలలో ఇరవయ్యోవంతు కూడ చేయని కసబ్‌ను మాత్రం ఉరితయవలసిందే అని వీరాలాపాలకు దిగడం సవ్యమేనా? లక్షన్నర మంది రైతుల ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా కారణమైన నూ నత ఆర్థిక విధాదానాలను ఈ దేశంలోకి తెచ్చిన మన్మోహన్‌సింగ్‌ ను ఆ హత్యలు చేసినందుకే ఆర్తికమంత్రి నుంచి ప్రధాన మంత్రిగా పదోన్నతి ఇచ్చి పదవీకాలాన్న రెండో దఫా పొడిగించి, నూట అరవై మందిని హత్య చయేసిన వాడిని మాత్రం ఉరితీయవలసిందే అని అగడం భావ్యమేనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభ óమవుతున్నదని ఒక విధాన ప్రకటన చేసి, దాన్ని ఉపసంహ రించుకుని, నిరాశా నిస్పృహలను వ్యాపిం పచేసి వెయ్యి మందిని అశోపహతులను చేసి హత్య చేసిన పాల కులు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండగా, నూట ఇరవై మందిని చంపి నవాడు మాత్రం ఉరికంబం ఎక్కవలసిందేనా? కనీసం లెక్కల ప్రకారం చూసినా పెద్ద నేరస్తులను వదిలిపెట్టి, చిన్న నేరస్తులను బలితీసుకోవడం న్యా యమా? అవన్నీ కూడ పోనీండి, కసబ్‌ ఉరితో ఓలలలాడేవాల్లు అంతకుముందు మరణించిన బాల్‌ ఠాక్రే గురించి అయినా ఆలోచించవద్దా? ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయన శివసేన అనే మతోన్మాద పార్టీని, సామ్నా అనే పత్రికను సడిపేవాడు. ఆయన రాసిన ఏ వ్యాసం చదివినా, ఆయన ఉపన్యాసాలు విన్నా ఆయనను మించిన తీవ్రవాది ఎవరూ ఉండరని తేలిపోతుంది.

ఆ రచనలు, ఉపన్యాసాలు అలా ఉంచి, 1960ల చివరినుంచి చనిపోవడానికి కొద్దిముందు బొంబాయిలోనూ, మహా రాష్ట్రలోనూ మరాఠీలు కాని వారందరి మీద, ప్రత్యేకించి ముస్లిల మీద విపరీతమైన ద్వేషభావనను రెచ్చగొట్టిన హిందుత్వ తీవ్రవాది ఆయన. 1966లో దసరా ఊరేగింపులో భాగంగా బొంబాయిలోని దక్షిణ భారత హోటళ్ల మీద, దుకాణాల మీద దాడులతో ప్రారంభించి, 1969లో ఇరవై మంది కన్నడిగులను హత్యచేసిన , వందలాది మందిని గాయ  పరచిన భాషా కల్లోలాలు రెచ్చ గొట్టాడు. సీపీఐ శాసనసభ్యుడు కృష్ణ దేశౄయి దళిత్‌ పాంథర్‌ కవి భగవతీదళ్‌ జాదవ్‌లతో సహా వంద లాది మంది భిన్న స్వరాలను హతమార్చిన ఘన చరిత్ర అయినది. దళితుల మీద ఆయన నేతృత్వంలోని శివసేన సాగించిన వాదులదాడుల పూర్తి జాబితా పేజీలకు పేజీలు అవుతుంది. 1993లో వెయ్యి మంది మరణి ంచిన ముంబై అల్లర్లకు ప్రధాన కారణం ఆయన రచనలేని, శివసైనికులకు ఆయన చేసిన ఉద్బోధనలేనని బిఎన్‌ శ్రీకృష్ణ న్యాయవిచారణ కమిషన్‌ నిర్దంద్వంగా ప్రకటించింది. 1997లో రమాబాయి అంబేద్కర్‌ నగర్‌ హత్యాకాండలో ఆయన శివసైనికులు ఒక్కరోజు పది మంది దళితులను హత్య చేశారు. మొత్తంమీద ముంబైలో, విదర్భలో బహుశా వేలాదిమందిని ఊచ కోత కోసిన ఘటనలకు రూపశిల్పి, వ్యూహకర్త బాల్‌ ఠాక్రే. మరి మన కళ్లముందరి ఈ హంతక సామ్రాజ్య చక్రవర్తికి సంతాప, శోక సందేశాలేమిటి? పొట్టకూటికి చేరిన ఉద్యోగ ధర్మంగా, లేదా తలకెక్కిన మతోన్మాదపు హింసాకాండగా అటువంటి హత్యలే కొన్ని చేసిన ఒక చదరంగపు పావును చంపడమేమిటీ? చంపినందుకు ఆనందించడమేమిటి? ఈ సందర్భాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేరం -శిక్ష ప్రక్రియ గురించి, ముఖ్యంగా మరణ శిక్ష గురించి, అధికారవర్గపు మారణకాండల నేరాల గురించి, వారికి వేయవలసిన శిక్ష గురించి కాస్త ఆలోచించవలసి ఉంది.

– ఎడ్ల పోచయ్య

(వీక్షణం సౌజన్యంతో…)ర