న్యాయసేవల మెరుగుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముంబయి: న్యాయవ్యవవస్థలో కలిసి పనిచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చెప్పారు. బోంబే హైకోర్టు 150వ వార్షికోత్సవం ముగింపు వేడుకలకు ప్రధాని హాజరై శనివారం ప్రసంగించారు. హైకోర్టుల న్యాయమూర్తుల పదవీవిరమణ వయస్సును పెంచడానికి ఉద్దేశించిన రాజ్యాంగా సవరణ బిల్లు పార్లమెంట్‌ ముందు ఉందని ప్రధాని చెప్పారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులు తగ్గిపోయాయని, బోంబే హైకోర్టు దాని పరిధిలో ఉన్న కోర్టులు పెండింగ్‌ కేసులను తగ్గించడంలో విశేష కృషి చేశాయని ప్రధాని చెప్పారు.