పంట చేతికి అందే సమయానికి తెగుళ్లు
వరుస తెగుళ్లతో పత్తి పంట
– రోజుకొక తెగుళ్లతో సతమతం
– అప్పులు చేసి పెట్టుబడి ఆందోళనలలో రైతులు
నాంపల్లి సెప్టెంబర్ 25 (జనం సాక్షి)
మండలం లోని సమయానికి వర్షాలు వచ్చినందున ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం పత్తి సాగు చేయుటలో నిమగ్నమయ్యారు.నల్గొండ జిల్లాలోని రైతులు…సమయానికి వర్షాలు వచ్చి అన్ని బాగున్నాయీ అనుకున్న రైతన్న… కలుపు కూలీల కోసం, ఎరువుల కోసం, పురుగుల మందుల కోసం అప్పులు చేసి పెట్టుబడులు పెట్టినా మని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు . తీరా పత్తి పంట పూత,కాయ అందే సమయానికి రోజుకొక తెగుళ్లతో రైతులు దిగులు చెందుతున్నారు. సరైన మెళుకువలు పాటించ లేక వెనుకబడి పోతున్నామని, రైతులు ఆవేదన చెందుతున్నారు.నకిలీ విత్తనాలతోనో, నకిలీ ఎరువులతోనో పత్తి పంటకు తెగుళ్లు వచ్చి నష్టపోతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. గులాబి పురుగు, ఆకుముడత, తెల్ల దోమ, పచ్చ దోమ సోకి కాయ, పూత రాలిపోయి మొక్క ఎదుగుదల ఎదుగుదల లేదని, ఎన్ని మందులు పిచికారి చేసిన పురుగు, దోమ తగ్గడం లేదని, ఒక్కొక్క చెట్టు ఎర్రగా మారి ఎండి పోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
మేకల రామలింగం రైతు పెద్దాపురం
మూడు ఎకరాల లో పత్తి పంట సాగు చేశా. ఇప్పటికి లక్ష రూపాయలు అప్పుగా తెచ్చి పెట్టుబడి పెట్టాను. అయితే ఒక్కొక్క చెట్టు ఎర్రగా మారి ఎండి పోతుందని, ఏది పడితే అది పిచికారి చేసి వేలకు వేలు నష్టపోతున్నాం.