పట్టణంలో విద్యార్థుల ఆందోళన

విజయనగరం, జూలై 17: ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యాన విద్యా సంస్థల బంద్‌కు వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి ఆ మేరకు తమ నిరసన తెలిపాయి. పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, వివిధ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా వివిధ విద్యార్థి సంఘాలు మంగళవారం ఆందోళనకు దిగాయి. దీనిలో భాగంగా పలు విద్యా సంస్థలను మూసి వేయించేందుకు ప్రయత్నం చేశారు. తరగతులను బహిష్కరిస్తూ తమ నిరసన తెలిపారు. ఆంతే కాకుండా కోటజంక్షన్‌ నుంచి కలెక్టర్‌రేట్‌ వరకు ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. మరోవైపు విద్యార్థుల నిరసన కార్యక్రమానికి యూటిఎఫ్‌తో సహా వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి.