పట్టాలు తప్పిన ఇంటర్‌సిటీ
బెగుసరాయ్: బీహార్‌లో దనపూర్ నుంచి జైనగర్ వెళ్తున్న ఇంటర్ సిటీ రైలు బుధవారం సాంకేతిక లోపం కారణంగా పట్టాలు తప్పింది. ఘటనలో 12 మంది గాయపడ్డారు. పట్టాలు తప్పిన రైలుని నిలువరించడానికి డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేయడంతో విద్యుత్తు స్తంబానికి ఢీకొట్టింది. గార్డు సహా 12 మంది గాయపడ్డారు.



