పత్తి చేను ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 24 : చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ఎర్రోళ్ల మల్లయ్యకు ఆకునూరు గ్రామ శివారు కాశేగుడిసెల ప్రాంతంలో ధర్మగడ్డ వద్ద రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో పత్తి చేను వేశాడు. వ్యవసాయ పనిలో భాగంగా రోజువారి లాగే బుధవారం పత్తి చేను వద్దకు వెళ్లి చూసేసరికి అర ఎకరం పత్తి చేను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు.