పదోన్నతి పొందిన ఆర్డీవోకు సన్మానం.

ఆర్డీవోను సన్మానిస్తున్న అధికారులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్29,(జనంసాక్షి)
డెప్యూటీ కలెక్టర్ స్థాయి నుంచి స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన బెల్లంపల్లి ఆర్డీవో శ్యామల దేవిని గురువారం ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా బెల్లంపల్లి తహసీల్దార్ కుమారస్వామి మాట్లాడుతూ ఆర్డీవో నుంచి స్పెషల్ గ్రేడ్ కలెక్టర్ గా పదోన్నతి పొందడం చాలా సంతోషకరం అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదోన్నతులు పొంది ఉన్నతస్థాయికి ఎదగాలని ఆశించారు. అధికారులు అంకితభావంతో విధులు నిర్వర్తిస్తే పదోన్నతులు అవే మనల్ని వెతుక్కుంటూ వస్తాయని, అందుకు నిదర్శనం ఆర్డీవో శ్యామల దేవి అన్నారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి పుష్పలత, డెప్యూటీ తహసీల్దార్ మాణిక్ రావు, గీర్దావర్లు పరమేశ్వరి, అది లక్ష్మీ, ఆర్డీవో కార్యాలయ సిబ్బంది, బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.