పదోన్నతుల్లో కోటా సాధ్యాం కాదన్న అటార్నీ జనరల్‌

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదన చట్టపరంగా సాధ్యం కాదని అటార్నీ జనరల్‌ వాహనవతి పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు న్యాయమంత్రిత్వశాఖకు  లేఖ రాసినట్లు సమాచారం. చట్టపరంగా ఇది సాధ్యం కానందున ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు కొట్టివేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నాట్లు తెలుస్తోంది. ఆగస్టు 21న అఖిల పక్ష సమావేశంలో ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగసవరణ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్న విషయం విదితమే.