*పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.

జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా.
చిట్యాల25( జనం సాక్షి) మన ఊరు, మన బడి కార్యక్రమం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు  మంజూరైన పనులను త్వరితగతిన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ భావేష్ మిశ్రా అన్నారు. శనివారం మండలంలోని చల్లగరిగ ,జూకల్ గ్రామాలలో జరిగే మన ఊరు మన బడి కార్యక్రమంలో జరిగే మౌలిక వసతుల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక సర్పంచులు, విద్యా కమిటీ చైర్మన్లు,అధికారులు కలిసికట్టుగా త్వరిత గతిన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ, సర్పంచులు కర్ర మంజుల అశోక్ రెడ్డి, పుట్టపాక మహేందర్, పిఆర్వో ఏ ఈ రవికుమార్,డీఈ వెంకటేశ్వర్లు, ఎంఈఓ కోడెపాక రఘుపతి ఉపాధ్యాయులు అధికారులు పాల్గొన్నారు

తాజావార్తలు