పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసిన  బి ఆర్ ఎస్  పార్టీ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ 

సంగారెడ్డి బ్యూరో  , జనం సాక్షి , ఆగస్టు 23   :::

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ గారిని ప్రకటించిన విషయం అందరికీ విధితమే. ఈ చింతా ప్రభాకర్  సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. అందులో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  డా. శ్రీహరి నివాసం వెళ్లి వారి కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా పలకరించి ముచ్చటించారు.

అలాగే టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులైన గంగా నర్సరీ యజమాని ఐ సి మోహన్ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ముచ్చటించారు . ఈ

కార్యక్రమంలో మాజీ CDC చైర్మన్ విజేందర్ రెడ్డి ,కంది జెడ్పీటీసీ కొండల్ రెడ్డి డా. శ్రీహరి , జీవి శ్రీనివాస్ ,మాజీ సర్పంచ్ రామ్ రెడ్డి ,మం.పార్టీ అధ్యక్షులు చక్రపాణి , లాడే మల్లేశం ,విఠల్ , గోవిద్ తదితరులు పాల్గొన్నారు.