పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే సైదిరెడ్డి – రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి పరామర్శ


హుజూర్ నగర్ మార్చి 9 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని గడ్డిరెడ్డి అనసూయ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న వేపల సింగారం గ్రామానికి చెందిన దొండపాటి నాగిరెడ్డి – లక్ష్మమ్మ కుమారుడి వివాహానికి నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాజరై ఆశీర్వదించారు. పట్టణ కేంద్రంలో మాధవరాయిని గూడెంకి చెందిన పార్థబోయిన సైదులు – సుజాత కుమారుడి వివాహనికి హాజరైన్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అతన్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి పరామర్శించారు. మండలంలోని కరక్కకాయల గూడెం గ్రామంలో జరుగుతున్న అంకతి పుల్లయ్య – రజినీ కుమార్తె వివాహ మహోత్సవనికి హాజరైన్నారు. నేరేడుచర్ల పట్టణ కేంద్రానికి చెందిన వజ్రపు శేఖర్ నిర్వహించిన మైసమ్మ మొక్కుబడి కార్యక్రమానికి హాజరైన్నారు. పెన్ పహాడ్ మండలంలో సత్య ఫంక్షన్ హాల్ నందు నేరేడుచర్ల మండలం నరసయ్య గూడెం గ్రామానికి చెందిన కర్ణం వీరభద్రయ్య – సుజాత కుమార్తె వివాహ మహోత్సవానికి హాజరైన్నారు. గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో ఈనెల 5వ తారీఖున రోడ్డు ప్రమాదం లో చనిపోయిన రేవూరి సునీత కుటుంబాన్ని పరామర్శించి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిట్యాల అమర్నాథరెడ్డి, జడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, మండల అధ్యక్షులు ముడెం గోపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి అమర్, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంత గాని శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.