పల్లె ప్రకృతి వనాలతో బిపి,షుగర్లు మాయం
ఊరుకో ప్రకృతి వనంతో పచ్చదనం
మండలానికో బృహత్ వనం ఏర్పాటు
19,472 ఆవాసాల్లో ప్లలె ప్రకృతి వనాలు
సర్పంచ్‌లు, అటవీ అధికారుల కృషి అభినందనీయం
రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటిన అధిరకారులు
అసెంబ్లీలో హరితహారంపై చర్చలో సిఎం కెసిఆర్
హైదరాబాద్,అక్టోబర్1 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు.. బీపీ, షుగర్లతో పాటు ఇతర జబ్బులతో బాధపడేవారికి ఎంతో ఉపయోగకరంగా మారాయన్నారు. ప్రశాంతతో పాటు మంచి ఆహ్లాదాన్ని పంచుతున్నాయని సీఎం తెలిపారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. గ్రామపంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశాం. నర్సరీల ఏర్పాటులో అటవీ అధికారుల కృషి విశేషంగా ఉందన్నారు. పల్లె ప్రకృతి వనాలతో చెట్ల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేశాం. 19,472 ఆవాసాల్లో ప్లలె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసామన్నారు. 13,657 ఎకరాల్లో ఈ వనాలు పెరుగుతున్నాయి. సర్పంచ్‌లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పల్లె ప్రకృతి వనాలను సర్పంచ్‌లు, మిగతా అధికారులు అద్భుతంగా తీర్చిదిద్దారు. గ్రామాల్లో బీపీ, షుగర్‌తో బాధపడేవాళ్లకు ఈ పార్కులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. మండలానికి ఒకటి చొప్పున బృహత్ ప్రకృతి వనాలు
ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 526 మండల్లాలో స్థలాలు గుర్తించి 7178 ఎకరాల్లో ప్లాంటేషన్ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. పట్టణాల్లో 109 ఏరియాల్లో 75740 ఎకరాల్లో అర్బన్ ఫారెస్టులు ఏర్పాటు చేస్తున్నారు. 53 అర్బన్ పార్కుల్లో పని బాగా జరిగింది. మిగతా ప్రాంతాల్లో కూడా పనులు కొనసాగు తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో చెట్లు నరికివేస్తే రూ. 4 లక్షల జరిమానా విధించాం. కఠినంగా వెళ్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో 2 కోట్ల 75 లక్షల ఎకరాల భూభాగం ఉంది. 66 లక్షల 25 వేల ఎకరాల పైచిలుకు అటవీ భూములు ఉన్నాయి. మొత్తం అడవులు మాయమైపోయాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో అద్భుతమైన అడవులు ఉండేవి . కానీ మాయమైపోయాయి. నర్సాపూర్‌లో ఒకప్పుడు ఫిలిం షూటింగ్‌లు జరిగేవి. కానీ మన కళ్ల ముందే అడవులు ధ్వంసం అయ్యాయి. అడవిని పునరుద్దరించేం దుకు మేధావులు పలు సూచనలు చేశారు. శాస్త్రీయ పద్ధతిలో వేర్ల ద్వారా అడవిని పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. 230 కోట్ల మొక్కలు నాటాలని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించాం. 1987లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో 10 వేల మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మొక్కలను సేకరించేం దుకు చాలా కష్టపడ్డాం. అనేక ఇబ్బందులు పడి 10 వేల మొక్కలు సేకరించి నాటామని తెలిపారు. అప్పట్లో నర్సరీలు ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 20 కోట్ల మొక్కలు అడవుల్లో పెట్టాలని నిర్ణయించాం. వేర్ల ద్వారా 80 కోట్ల మొక్కలను పునరుద్ధరించాలని, 100 కోట్ల మొక్కలు బయట నాటాలని ప్రయాణం మొదలు పెట్టాం. 20 కోట్ల మొక్కలు టార్గెట్‌గా పెట్టుకుంటే.. ఇప్పటికే 20.64 కోట్ల మొక్కలు నాటాం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలు టార్గెట్ పెట్టుకుంటే 14.5 కోట్ల మొక్కలు నాటాం. అటవీ ప్రాంతాల బయట 130 కోట్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, 176.82 కోట్లు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గ్రీనరీలో ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. మొదటి స్థానంలో కెనడా, రెండో స్థానంలో బ్రెజిల్, మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందన్నారు. యూఎన్వో కూడా తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని గుర్తించి ప్రశంసించింది అని సీఎం గుర్తు చేశారు. శాసనసభలో హరితహారంపై స్వల్పకాలిక చర్చ చేపట్టిన సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. మన దేశంలోనే అత్యంత నిరాదరణకు గురైన రంగం అటవీ రంగం. దీని కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిన్నది. ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వర్షాలు తగ్గిపోయాయి. కరువులు వచ్చాయి. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ గమనిస్తుంటారు. భవిష్యత్ తరాలకు ప్రమాదం, నష్టం జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేస్తుంటారు. పర్యావరణ సమతులత్యత పెంచడం, గ్రీనరీని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. న్యూజిలాండ్‌లో ఓ పార్టీ పేరే గ్రీన్ అని ఉంది. ఆ పార్టీ సృష్టించిన అవగాహన వల్ల అక్కడ పర్యావరణ సమతుల్యత దెబ్బతినలేదు. గ్రీనరీ పెంచడమే లక్ష్యంగా గ్రీన్ అని పార్టీకి పేరు పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. సామాజిక అడవులతో అనేక ప్రయోజనాలుంటాయి. జీడీపీలు, జీఎస్డీపీలు పెంచినా, వ్యక్తులు తమ ఆస్తులు పెంచినా.. జీవించలేని పరిస్థితులు లేకపోతే ఏం చేయగలం. కాబట్టి దీనిపై ప్రతి ఒక్కరూ దృష్టిసారించాలి. తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీని పునరుద్ధించాలనే ఉద్దేశంతో.. ఈ స్జబెక్టుపై సవిూక్ష చేశాను. పచ్చదనం తగ్గిపోవడం, పరిస్థితులు మారిపోవడం, వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడం.. వీటిని పునరుద్ధరించడం కోసం అనేక ప్రయత్నాలు ఉంటాయి. అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవాలంటే మొక్కలు నాటాలి. మొక్కలు నాటడం ద్వారా ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోవచ్చు అనిసీఎం కేసీఆర్ తెలిపారు.