పాఠశాల విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్………


బోనగిరి టౌన్ (జనం సాక్షి):–
వాసవి క్లబ్ యాదాద్రి భువనగిరి ఆధ్వర్యములో వాసవి క్లబ్స్ఇంటర్నేషనల్ మాజీ అధ్యక్షులు అయిత రాములు వివాహ మహోత్సవ సందర్భముగా వారి సహకారముతో పాఠశాలకు నడిచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్న 5 గురు బాలికలకు 25000 రూ విలువగల 5 సైకిళ్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారి చేతుల మీదుగా అందించడం జరిగింది .ఈ కార్యక్రమములో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ కార్యదర్శి ఇరుకుల్ల రామకృష్ణ అధ్యక్షులు తాటిపల్లి రవీందర్ ప్రధాన కార్యదర్శి సుగ్గుల చంద్ర శేఖర్ జోన్ చైర్మన్ మంచాల ప్రభాకర్ సభ్యులు పోకల సోమన్న ,బుస్సా రమేష్ ,సోమ బనారస్ తదితరులు పాల్గొన్నారు.