పాముకాటుకు గర్భిణీ మృతి

విజయనగరం, జూలై 18 : పార్వతీపురం మండలం ములగ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీ సురాపాటి సంధ్యారాణి (22) బుధవారం నాడు పాము కాటుకు మృతి చెందింది. ములగలోని తమ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి 2.30 గంటలప్రాంతంలో ఇంట్లోకి వచ్చిన పాము సంధ్యారాణిని కాటు వేసింది. ఆమెను 108 వాహనంలో భర్త సురేష్‌ కుటుంబ సభ్యులు పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలందించిన కొద్ధి సేపటికే మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సంధ్యారాణి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

తాజావార్తలు