పార్లమెంట్‌ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై లోక్‌సభ స్పీకర్‌కు చంద్రబబు లేఖ

హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఆవరణలో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుపై లోక్‌సభ స్పీకర్‌ మీరకుమార్‌కు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు లేఖ రాశారు. ఆ వివాదానికి ముగింపు పలకాలని అనుకుంటున్నట్లు చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. గతంలో పురందేశ్వరి రాజకీయ దురుద్దేశంతో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నారని అన్నారు. విగ్రహం ఏర్పాటు చేసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతివ్వాలని కోరారు. అది సాధ్యం కాకపోతే తెదేపాకు అనుమతిస్తే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బాబు పేర్కొన్నారు.