పాలమూరు జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం సుంకలోనిపల్లిలో దారుణం జరిగింది. కొండన్న అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొండన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.