పాల్వంచలో తెలంగాణ పోరుయాత్ర ప్రారంభం

ఖమ్మం: ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ తెలంగాణ పోరుయాత్ర ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీపీఐ నేత నారాయణ హాజరయ్యారు. ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, గండా మల్లేష్‌, చంద్రావతి, తెలంగాణ ఐకాస కన్వీనర్‌ కోదండారాం, శ్రీనివాసగౌడ్‌ తదితరులు పోరుయాత్రలో పాల్గొన్నారు.