పితృవియోగం.. ఈటలకు కేటీఆర్‌ ఫోన్‌లో పరామర్శ


హైదరాబాద్‌(జనంసాక్షి):హుజురాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఈటలకు ఫోన్‌ చేసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న మల్లయ్య ఆర్‌వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. మంగళవారం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. కాగా మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈటల రాజేందర్‌ రెండో కుమారుడు.