పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన ఆపరేషన్
పెనుబల్లి, ఫిబ్రవరి 25(జనం సాక్షి)పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఓ మహిళకు కార్పొ రెట్ స్థాయిలో అరుదైన ఆపరేషన్ చేసారు, మెడికల్ ఆపిసర్ డాక్టర్.రమేష్ ఎం ఎస్.సర్జన్.వైద్యబృందం అధ్వర్యంలో మహిళకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న షుమారు 8 కేజీల క్యాన్సర్ కణితిని బైటకు తీశారు, తల్లాడ మండలం కుర్ణవెళ్ళి గ్రామానికి చెందిన శీలం నాగిరెడ్డి భార్య పద్మావతినిరుపేద అయిన పద్మావతి కడుపు ఉబ్బరం తో పెనుబల్లి ఆసుపత్రికి వచ్చిన ఆమెకు, వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిం చారు, ఆమె కడుపులో కేన్సర్ కణితి ఉందని తేలడంతో ఆమెకు బరోసా కల్పించి డాక్టర్ రమేశ్ వైద్య బృందం డాక్టర్. అశోక్, స్టాప్ నర్స్ కె. శోభారాణి, పి లక్ష్మి అధ్వర్యంలో విజయ వంతం గా పద్మావతి కి ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కణితిని తీసి వేశారు, ఆసుపత్రి వైద్య బృందానికి శీలం నాగిరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.