పేకాటరాయుళ్లు అరెస్ట్‌

కురిచేడు , జూలై 28 : మండలంలోని డేకనకొండ గ్రామంలో పేకాట స్థావరాలపై కురిచేడు ఎస్‌ఐ ఎస్‌ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం దాడిచేసి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు కురిచేడు ఎస్‌ఐ ఎస్‌ సుబ్బారావు తెలిపారు. వీరి వద్ద నుండి 4200 నగదు స్వాధీనం చేసుకున్నామని సోమవారం వీరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు.