పేపరు లీకై నిస్సహాయ స్థితిలో ఉన్న పేద నిరుద్యోగ విద్యార్థులకి న్యాయం చేయండి
– తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పేపర్ లీకేజ్ ఘటనపై సిబిఐ విచారణ చేపట్టాలి
– దోషులు ఎంతటి వారైనా శిక్షించండి
– అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోలపూడి యోహాన్ హుజూర్ నగర్ మార్చి 23 (జనంసాక్షి): పరిపాలించే ప్రభుత్వాలకు చేతులెత్తి మొక్కుతున్నాం పేపరు లీకై నిస్సహాయ స్థితిలో ఉన్న పేద నిరుద్యోగ విద్యార్థులకి న్యాయం చేయాలని హుజూర్ నగర్ అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షులు కోలపూడి యోహాన్ కోరారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది పేద, నిరుద్యోగ విద్యార్థులు స్తోమత లేకపోయినా అప్పులు చేసి హాస్టల్లో ఉండి తిని, తినక చదివిన చదువులు ఇలా అర్ధాంతరంగా అసమర్ధతతో పేపర్ లీకై విద్యార్థుల ఆశలు ఆవిరయ్యాయి అన్నారు. విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నారు అన్నారు. ప్రభుత్వ అసమర్థతతో జరిగినటువంటి తప్పుకి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ లీకేజీ వెనక ఉన్న ప్రతి ఒక్కరిని బయటికి లాగాలని, ఈ విచారణను సిబిఐ కి ఒప్ప చెప్పాలని, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు.
ప్రతివిద్యార్థికి ప్రభుత్వం ఆర్థికంగా రూ. 5,00,000 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉద్యోగాలు పొంది బాధ్యత లేకుండా వ్యవహరించిన ఉద్యోగులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. పేద నిరుద్యోగ విద్యార్థులకు ప్రభుత్వమే తగిన న్యాయం చేయాలన్నారు.