పైలట్ల సమ్మెతో 4 కింగ్‌ఫిషర్‌ సర్వీసుల రద్దు

ముంబయి: పైలట్ల సమ్మెతో ముంబయి విమాన్నాశయం నుంచి 4 కింగ్‌ఫిషర్‌ విమానాలు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేని కారణంగా ముంబయి-చైన్నై, ముంబయి-మంగళూరు, ముంబయి-ఖజురలో తదితర సర్సీసులను రద్దు చేశారు.గత  5 నెలలుగా జీతాలు చెల్లించనందుకు నిరసనగా 200 మంది కింగ్‌ఫిషర్‌ పైలట్లు నిన్నటి నుంచి సమ్మెలోకి దిగిన విషయం  తెలిసిందే.