పోచమ్మ కొలుపు లో పాల్గొన్న రామగిరి తహసిల్దార్
జనం సాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామ ప్రజల ఆహ్వానం మేరకు గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూదేవి సహిత బొడ్రాయి ,శ్రీ మహాలక్ష్మి ప్రతిష్ట, పోచమ్మ కోలుపు లో పాల్గొని, దర్శనం చేసుకొని ప్రజలంతా పాడిపంటలతో, సుఖసంతోషాలతో ఉండాలని , గ్రామ దేవతల ఆశీస్సులు రామగిరి తహశీల్ధార్ రామ్మోహన్, కార్యాలయ సిబ్బంది తీసుకున్నారు. వారిని మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మ్యాదరవేణి కుమార్ యాదవ్ , ఎంపీటీసీ చిందం మహేష్ , బిఆర్ఎస్ నాయకులు అల్లం తిరుపతి,శ్రీనివాస్ ఆరు యాదవ్ , చిందం రమేష్ , గంధం శ్రీనివాస్ లు సన్మానించారు.